ఇక చాలు.. రోహిత్ బ్రేక్ తీసుకుంటే బెటర్?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎందుకో జట్టుని సమర్థవంతంగా ముందుకు నడిపించలేక పోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా ఘోరంగా విఫలమవుతోంది ముంబై ఇండియన్స్ జట్టు. దీంతో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన పై రోహిత్ కెప్టెన్సీపై కూడా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాఘన్ కీలక వ్యాఖ్యలు చేశాడు ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఒకవేళ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వకపోతే రోహిత్ బ్రేక్ తీసుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఐపీఎల్లో ఆడాలని ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎదురుచూస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్న రోహిత్ శర్మ పక్కకు తప్పుకుని యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండటం వల్ల యువతకు ఒక వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఛాన్స్ ఉంటుంది అంటూ మైఖేల్ వాఘన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ అటు కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఒక ఆటగాడిగా కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లలో కూడా కేవలం 114 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 41 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.