ఐపీఎల్ : ఒక్క మ్యాచ్.. ప్లే ఆఫ్స్ కోసం రెండు జట్లూ గెలవాల్సిందే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ఎంతో రసవత్తరంగా మారిపోతుంది. ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకునే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి జట్టు కూడా హోరాహోరీగా పోరాటానికి సిద్ధమయ్యాయ్. ఈ క్రమంలోనే వరుసగా విజయాలు సాధిస్తూ ఇక పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది అని చెప్పాలి. దీంతో ఇక ప్రస్తుతం ప్రతీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా రసవత్తరంగా సాగుతుంది అని చెప్పాలి. ఐపీఎల్ లో కొన్ని జట్లు పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నాయి.


 కాగా నేడు ఐపీఎల్ 20202 సీజన్లో భాగంగా మరో బిగ్ మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుతం పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది పంజాబ్ కింగ్స్. ప్రేక్షకుల ఊహకందని విధంగా పేలవా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. కాగా ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక అతి కష్టం మీద రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సారథ్యంలో బరిలోకి దిగింది. మొదట్లో వరుస విజయాలు సాధించింది.


 ఈ క్రమంలోనే ఈ సారి పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ తర్వాత వరుస పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏకంగా ఏడు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుండగా రెండు విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం పంజాబ్కింగ్స్ కి మయాంక్ అగర్వాల్, చెన్నై సూపర్ కింగ్ కి రవీంద్ర జడేజా ఇద్దరు కూడా కెప్టెన్సీకి కొత్తవాళ్ళే కావడం గమనార్హం.


 అయితే ఇప్పటివరకూ ఈ రెండు జట్ల గణాంకాలు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది. కానీ ఈ ఏడాది పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది తెలియని విధంగానే మారిపోయింది. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్ల కూడా నేడు జరగబోయే మ్యాచ్ కు ఎంతో కీలకం అని చెప్పాలి. దీంతో ఇక ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా ఉంటుంది అని ఐపీఎల్ ప్రేక్షకులు అందరూ కూడా భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: