కోహ్లీ చీకట్లో ఉన్నాడు : పీటర్సన్

praveen
ప్రపంచ క్రికెట్ లో పరుగుల మిషన్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ కి ఏమైంది. ఒకవైపు కెప్టెన్గా మరోవైపు ఆటగాడిగా  ఎంతో ఒత్తిడిలో కూడా బాగా రాణించిన విరాట్ కోహ్లీ కి ఇప్పుడు కెప్టెన్సీ లేకపోయినా ఎందుకు బాగా రాణించలేక పోతున్నాడు. విరాట్ కోహ్లీ పని అయిపోయినట్లేనా.. పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావడం కష్టమేనా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయ్. ఎందుకంటే మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో పెద్ద గా రాణించని విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఐపీఎల్ కూడా అదే పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు.


 ప్రతి మ్యాచ్లో కూడా భారీ అంచనాల మధ్యబరిలోకి దిగడం ఆ తర్వాత తక్కువ పరుగులు చేసి వికెట్ చేజార్చుకుంటూ ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు అయిన విరాట్ కోహ్లీ ఇలా చేయడం ఏంటిఅని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పేలవమైన ఫాంపై ప్రస్తుతం అందరూ విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటీవల వరుసగా రెండు మ్యాచ్లలో డకౌట్ గా వెనుదిరిగాడు విరాట్ కోహ్లి. ఇకపోతే ఇదే విషయంపై మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ప్రస్తుతం విరాట్ కోహ్లీ చీకటి ప్రదేశంలో ఉన్నాడు అంటూ వ్యాఖ్యానించాడు కెవిన్ పీటర్సన్. ప్రస్తుతం కోహ్లీ ఏ స్థితిలో ఉన్నాడో గతంలో నా కెరీర్లో రెండుసార్లు నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇది ఆటగాడికి మంచిది కాదు.  చీకటి ప్రదేశంలో నుండి బయటకు రావాలి. ముఖ్యంగా అందరి దృష్టి వారిపైనే ఉన్నప్పుడు అది పూర్తిగా ఒంటరి ప్రదేశం.. ఇది త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే క్రికెట్లో అతను ఇంకా ఎన్నో పరుగులు సాధించాల్సి అవసరం ఉంది అంటూ కెవిన్ పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: