మైదానంలో గొడవ.. హర్షల్ పటేల్ ఇలా చేయడం ఏం బాలేదు?

praveen
ఇటీవల రాజస్థాన్ రాయల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ  భరితంగా జరిగింది.  మొదట టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ క్రమంలోనే బెంగళూరు బౌలర్ల ధాటికి రాజస్థాన్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేసారు. మొన్నటి వరకు భారీగా పరుగులు చేసిన వారు తక్కువ పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఇక అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు రియాన్ పరాగ్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో ఇక ప్రత్యర్థి ముందు ఒక మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది రాజస్థాన్ రాయల్స్ జట్టు.


 ఇక ఫుల్ ఫాంలో కొనసాగుతున్న బెంగళూరు జట్టు ఎంతో అలవోకగా టార్గెట్ ఛేధించగలుగుతుంది అని అనుకున్నారు. కానీ చివరికి 29 పరుగుల తేడాతో ఓటమి చవిచూసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఇక ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ బెంగుళూరు బౌలర్ హాస్టల్ పటేల్ మధ్య గొడవ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. మాటల యుద్ధంలో దాదాపు ఒకరిని ఒకరు కొట్టుకొని స్థాయి వరకు వెళ్లారు. హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో రెండు సిక్సర్లు  ఒక ఫోర్ కొట్టి 18 పరుగులు రాబట్టాడు రియాన్ పరాగ్.



 ఈ క్రమంలోనే ఇక హర్షల్ పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఇక పరాగ్ కూడా కోపంగానే  స్పందించాడు. ఒకరిపై ఒకరు దూసుకు వచ్చారు. ఇక మధ్యలో మిగతా ఆటగాళ్లు కలుగజేసుకోవటం తో వీరి వివాదం ముగిసింది. మ్యాచ్ లో ఎన్ని వివాదాలు జరిగినా కూడా మ్యాచ్ అనంతరం మాత్రం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆనవాయితీని తుంగలో తొక్కారు హర్షల్ పటేల్. పరాగ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ అతను కనీసం మొహం కూడా చూడలేదు. రియాన్ పరాగ్ తో చేతులు కలపడానికి ఇష్టపడని హర్షల్ పటేల్ వేరే ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: