టి20 ప్రపంచ కప్.. ఇలా ఆడితే కోహ్లీకి కష్టమేనా?
కానీ కోహ్లీ మాత్రం రోజు రోజుకి తన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటూ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతూనే ఉన్నాడు. ఇటీవలే ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఒక కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే జట్టును నడిపించే బాధ్యతలు భుజాలపై లేకపోయినప్పటికీ విరాట్ కోహ్లీ బ్యాట్ ఝాలిపించ లేకపోతున్నాడు. ఇక ప్రతి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
దీంతో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన పై విమర్శలు చేస్తున్నారు. అయితే కోహ్లీ బలహీనతలను తమ బలంగా మార్చుకుంటున్న బౌలర్లు ఆఫ్ స్టంప్ కు దూరంగా బంతులను విసురుతూ కోహ్లిని పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అవుతున్నారు. సన్రైజర్స్ లక్నో జట్ల తో జరిగిన మ్యాచ్ లో ఇలాంటిదే జరిగింది. ఇక ఇదే ఫామ్ విరాట్ కోహ్లీ కొనసాగిస్తే టి20 ప్రపంచ కప్ లో అతనికి చోటు దక్కుతుందా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతో మంది యువ ప్లేయర్ల పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఇక కోహ్లీ స్థానం రానున్న రోజుల్లో ఉంటుందా ఊడుతుందా అన్నది కూడా అర్థం కాని విధంగానే మారిపోయింది..