కోహ్లీ, రోహిత్.. మా ఆశలన్నీ మీ పైనే?
ఇలా ఫార్మాట్ ఏదైనా సరే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ సృష్టింఛే విధ్వంసం అంతా ఇంతా కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక మొన్నటివరకు విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగితే.. ఇక కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అటు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా మారిపోయాడు రోహిత్ శర్మ. ఇక అసలు విషయానికి వస్తే ఇలాంటి కీలకమైన క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం పేలవమైన స్థానంలో కొనసాగుతున్నారు. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ ముంబై జట్టులో రోహిత్ శర్మ కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. భారత క్రికెట్ కు పిల్లర్ల లాంటి ఇద్దరు క్రికెటర్లు ఇలా రాణించడం పై అందరూ అవాక్కవుతున్నారు.
అప్పుడు పరుగుల వరద పారించి రికార్డులు కొల్లగొట్టిన వీరు ఫెయిల్యూర్ చూసి బాధ పడి పోతున్నారు అభిమానులు. అయితే ఐపీఎల్ లో సరిగా ఆడక పోయినా పర్వాలేదు కానీ రానున్న రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇద్దరి క్రికెటర్లు పుంజుకుని మునుపటి ఫామ్ లోకి రావాలి అని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఒకవేళ ఇదే పేలవమైన ఫామ్ను కొనసాగిస్తే అటు టీమిండియాకు వరల్డ్ కప్ దక్కడం కలగానే మిగిలిపోతుంది అంటూ చెబుతూ ఉన్నారు అభిమానులు. ఇద్దరు సీనియర్ క్రికెటర్లు రానున్న మ్యాచ్ లలో ఫామ్ లోకి వస్తారా లేదా చూడాలి..