డేవిడ్ వార్నర్ బ్యాటింగ్.. సునీల్ గవాస్కర్ ఏమన్నాడో తెలుసా?

praveen
డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ పాపులారిటీ సంపాదించిన విదేశీ ఆటగాళ్లలో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ కూడా ఒకరు. కేవలం క్రికెట్ ద్వారా మాత్రమే సోషల్ మీడియా ద్వారా కూడా భారత అభిమానులందరికీ కూడా ఫేవరెట్ గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. అందుకే ఇక అటు జట్లతో సంబంధం లేకుండా డేవిడ్ వార్నర్ తీరును చూసేందుకు  ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఐపీఎల్ ప్రేక్షకులు. అయితే గత ఏడాది వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగాడు డేవిడ్ వార్నర్. ఇటీవలే అతన్ని రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలోకి వదిలేసింది సన్రైజర్స్. దీంతో మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్ ను సొంతం చేసుకుంది.



 కాగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు డేవిడ్ వార్నర్. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే చెప్పాలి. ఇక ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా డేవిడ్ వార్నర్ మంచి ప్రదర్శన చేశాడు. ఇక ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్ పాజిటివ్ వాతావరణం వార్నర్ ఆటతీరుపై ప్రభావం చూపించడం వల్లే అతను బాగా రాణించగలుగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. గత రెండు సీజన్లలో సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఇక ఇలాంటి పాజిటివ్ వాతావరణం వార్నర్ కు దక్కలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇంకా పరుగులు చేయాలనే తపన వార్నర్ లో కనిపిస్తుంది అంటూ సునీల్ గవాస్కర్ అన్నాడు. కాగా గత రెండు సీజన్లలో కూడా సన్ రైజర్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ ను ఘోరంగా అవమానించింది సన్రైజర్స్ యాజమాన్యం. ఒకసారి జట్టుకు టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ కు కనీస గౌరవం ఇవ్వకుండా కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాదు అటు జట్టు నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే సునీల్ గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు అన్నది తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: