ఐపీఎల్ : సహచరులు ప్రత్యర్థులుగా.. ఆసక్తికర పోరు?

praveen
ఐపీఎల్ పోరు ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారిపోయింది. ఈ ఏడాది ఐపీఎల్కు ముందు మెగా వేలం జరగడంతో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఎవరు ఊహకందని విధంగా మారిపోయింది. కానీ ఇప్పటివరకు ఐపీఎల్లో దాదాపు ఏడు పైగా మ్యాచ్ లు ముగియడంతో ప్రస్తుత సీజన్లో ఏ జట్టు బాగా రాణిస్తుంది అన్నదానిపై ప్రేక్షకులలో ఒక అంచనా వచ్చింది. అయితే ప్రస్తుతం అటు ప్లే ఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవడానికి సర్వ  ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ప్రతీ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా రసవత్తరంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇకపోతే ఒక్క మ్యాచ్ కి మించి మరో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది అని చెప్పాలి. కాగా నేడు మరో ఆసక్తికర పోరు జరగబోతుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ రెండు జట్లు కూడా మొదట్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాయ్. వరుస విజయాలు సాధించాయి. కానీ ఆ తర్వాత మాత్రం విజయం కోసం పడరాని పాట్లు పడుతూ ఉన్నాయి. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో సరైన ప్రణాళికలు అమలు చేయలేక చివరికి ప్రత్యర్థి చేతిలో ఓటమి చవి చూస్తూ ఉన్నాయి.


 కాగా ఇప్పటివరకు ఈ ఐపీఎల్ సీజన్ లో లక్నో 8 మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు ఎనిమిది మ్యాచ్లలో 4 విజయాలు సాధించడం గమనార్హం. కాగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అంటే చెప్పాలి. ఇప్పటివరకు రెండు సెంచరీలు చేశాడు కె.ఎల్.రాహుల్. ఇదివరకు పంజాబ్ కింగ్స్   లో సహచరులుగా ఆడిన కె.ఎల్.రాహుల్ మయాంక్ అగర్వాల్ నేడు జరగబోయే మ్యాచ్ లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు ఈరోజు పూణే వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: