డేవిడ్ వార్నర్ షాకింగ్ రికార్డ్.. ఐపీఎల్ లోనే ఒకే ఒక్కడు?
ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాట్స్మెన్ గా గా సూపర్ సక్సెస్ అవుతున్నాడు డేవిడ్ వార్నర్. ప్రతి మ్యాచ్ లో భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా భారీ పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు డేవిడ్ వార్నర్. కాగా ఇప్పటికే ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన డేవిడ్ వార్నర్ ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇటీవలే కోల్కతాలో జరిగిన మ్యాచ్లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో రెండు జట్ల పై వెయ్యికి పైగా పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.
కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై 26 మ్యాచ్ లలో ఒక వెయ్యి ఎనిమిది పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ అంతకుముందు.. పంజాబ్ కింగ్స్ జట్టుపై 22 మ్యాచ్ లలోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే దీంతో రెండు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా ఐపీఎల్ హిస్టరీ లో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఒక జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ళు ఉన్నారు కానీ రెండు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్లో ఎవరూ లేరు అని చెప్పాలి. ఇక ఈ అరుదైన రికార్డు గురించి తెలుసి అటు డేవిడ్ వార్నర్ అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు..