నిజాయితీ అంటే ఇది.. అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా?

praveen
ప్రస్తుతం క్రికెట్లో ఎంతో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అనే విషయం తెలిసిందే. ప్రతి విషయంలో కూడా ఎంతో కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అంపైర్లు. ముఖ్యంగా డిఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇక ఔట్ ను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక బ్యాటింగ్ జట్టు బౌలింగ్ జట్టుకు ఏమాత్రం సందేహం ఉన్నా కూడా వెంటనే రివ్యూకు వెళ్ళిపోయి డిఆర్ఎస్ ద్వారా తమ సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలాంటి సమయంలోనే కొంత మంది ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అందరి మనసులను దోచేస్తూ ఉంటారు. అంపైర్  అవుట్ ఇవ్వకపోయినప్పటికీ క్రీడా స్ఫూర్తితో తమని తాను ఔట్ గా ప్రకటించుకుని పెవిలియన్ చేరడంతో లాంటివి చాలా అరుదుగా క్రికెట్లో చూస్తూ ఉంటామ్. అయితే ఇటీవలే ఐపీఎల్లో ఇలాంటిదే జరిగింది. పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ లో 13 ఓవర్ సందీప్ శర్మ బౌలింగ్ వేశాడు.  ఇక ఆ ఓవర్లో సందీప్ వేసిన ఒక బంతి డీకాక్ బ్యాట్ తాకుతూ కీపర్ జితేష్ చేతిలో పడింది.


 అయితే వెంటనే పంజాబ్ ఆటగాళ్లు అందరూ కూడా ఔట్ కోసం అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కానీ అటు డీకాక్ మాత్రం తను అవుట్ అంటూ ప్రకటించి క్రీజు వీడాడు   ఈ నేపథ్యంలో పెవీలియన్ వెళుతున్న డీకాక్ నిజాయితీని సందీప్ శర్మ మెచ్చుకుంటూ అతని భుజం తట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు క్వింటన్ డికాక్  క్రీడాస్ఫూర్తి హాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం. కాగా గతంలో కేవలం కొంత మంది క్రికెటర్లు మాత్రమే ఇలా నిజాయితీగా తమని తాము అవుట్ గా ప్రకటించుకున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: