కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్.. వైరల్ వీడియో?
ఇక ఇటీవల ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి క్యాచ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక ఈ క్యాచ్ పట్టింది ఎవరో కాదు విన్నింగ్ జట్టు లక్నో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ కావడం గమనార్హం. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా బాలెన్స్ చేసుకుని అందుకున్నాడు. చమీరా వేసిన ఇన్నింగ్స్ ఓవర్ లో ఇది చోటు చేసుకుంది. మయాంక్ అగర్వాల్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 25 పరుగులతో జోరుగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు.
ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ వికెట్ తీసేందుకు బంతిని చామీరా చేతిలో పెట్టాడు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్. చామీరా ఓవర్ లో తొలి బంతిని సూపర్ సిక్సర్ కొట్టాడు మయాంక్ అగర్వాల్. నాలుగో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. మీడాఫ్ దిశగా గాల్లోకి వెళ్ళింది బంతి. అయితే కేఎల్ రాహుల్ వెనక్కి తిరిగి తన తలపై నుంచి వెళ్తున్న బంతిని ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో నిరాశలో మునిగిపోయాడు మయాంక్ అగర్వాల్. ఇక ఈ అద్భుతమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కావాలి మయాంక్ అగర్వాల్ కేఎల్ రాహుల్ మంచి మిత్రులు అనే విషయం తెలిసిందే..