తిరిగి ధోనికి కెప్టెన్సీ.. వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడో తెలుసా?
ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్న రవీంద్ర జడేజా కెప్టెన్సీలో అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ విఫలమవుతూ వచ్చింది. ఒకవైపు కెప్టెన్ గా మరోవైపు ఆటగాడిగా కూడా అటు రవీంద్ర జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా. కెప్టెన్సీ బాధ్యతలను మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ధోని మళ్ళీ కెప్టెన్సీ చేపట్టడంపై ప్రస్తుతం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే స్పందిస్తున్న ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ లో కెప్టెన్సీ విషయంలో గందరగోళం నెలకొనడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జడేజాను కెప్టెన్గా నియమించిన నాటి నుంచి నేను ఈ విషయాన్ని చెబుతూ ఉన్నా.. ధోని కెప్టెన్ గా లేకపోతే చెన్నై జట్టుకు ఏది కలిసి రాదు ఆలస్యమైనా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇంకా చెన్నై జట్టుకు అవకాశం ఉంది. ఇక చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి కావలసినన్ని మ్యాచ్ లు కూడా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ధోనీ కెప్టెన్ గా మారిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.