బట్లర్ బతికిపోయాడు.. పెద్ద ప్రమాదం తప్పింది?
అయితే ఇక ఈ మ్యాచ్ ఆసాంతం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అనే చెప్పాలి. చివరి వరకు ఎవరు గెలుస్తారో అని కూడా ఉత్కంఠ గానే మారిపోయింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ కొద్దిలో గాయం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ లో భాగంగా ఆరో ఓవర్ మెరిడిత్ వేశాడు. ఐదో బంతి మెరీడిత్ షార్ట్ బౌన్సర్ వేశాడు. జోష్ బట్లర్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బంతి మిస్ అయ్యి ఇక హెల్మెట్ను బలంగా తాకింది. దీంతో జోస్ బట్లర్ కి పెద్ద గాయం అయింది అని అందరూ అనుకున్నారు.
ఇక బంతి వేగానికి బట్లర్ తల అద్దిమినట్లు అయింది. దీనితో ఫిజియో వచ్చి పరిశీలించారు. ఇక తాను బాగానే ఉన్నట్లు బట్లర్ చెప్పుకొచ్చాడు. దీంతో రాజస్థాన్ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు అనే చెప్పాలి. దీంతో ఆ తర్వాత ఆట యథాతథంగా కొనసాగింది. అయితే బట్లర్ తలకి గాయం కావడంతో రాజస్థాన్ అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. గాయం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు..