తొలి మ్యాచ్ లోనే అదుర్స్.. ఇంతకీ ఎవరీ కార్తికేయ?

praveen
ఇటీవలికాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో సత్తా చాటుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ లో సరి కొత్త ఆటగాళ్లు తెర మీదికి వస్తు తమ ప్రతిభతో అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారూ. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్ బోణీ కొట్టింది ముంబై ఇండియన్స్.

 అయితే ముంబై ఇండియన్స్ మొదటి విజయం సాధించడంలో అటు అరంగేట్రం చేసిన ఓ యువ ఆటగాడు కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో కారణంగానే ముంబై జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్నర్ కుమార్ కార్తికేయ  ఆరంగేట్రం  మ్యాచ్ లోనే తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి కార్తికేయ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా సాధించాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభ తో అందరిని ఆకర్షించాడు అని చెప్పాలి.

 ముఖ్యంగా ఎంతో దూకుడుగా ఆడుతున్న డేంజరస్ సంజూ శాంసన్ ను అవుట్ చేసి అటు రాజస్థాన్ పరుగులు జోరుకి కార్తికేయ బ్రేకులు వేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈ కార్తికేయ ఎవరు అనే అంశంపై ప్రస్తుతం పెద్ద చర్చలు జరుగుతున్నాయని చెప్పాలి. ఈ ఆటగాడు గురించి కాస్త వివరాల్లోకి వెళితే   మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన కార్తికేయ టోర్నీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్నాడు. 2018లో లిస్ట్ ఏ తరుపున  క్రికెట్లో కార్తికేయ  అరంగేట్రం చేసాడు. కాగా ఈ యువ ఆటగాడు  ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు.. 19 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు  ఫస్ట్క్లాస్ క్రికెట్లో 35 వికెట్లు లిస్ట్ ఏ క్రికెట్ లో 10 వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: