28 ఏళ్ల రికార్డు.. సమం చేసిన చటేశ్వర్ పుజారా?
ఈ క్రమంలోనే మునుపటి ఫామ్ లోకి వచ్చేందుకు ఇప్పుడు కౌంటీల్లో ఆడుతున్నాడు చటేశ్వర్ పుజారా. ఇక ఇంగ్లాండ్ కౌంటీలో రెచ్చిపోయి ఆడుతున్న తీరు చూస్తూ ఉంటే అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగి పోతున్నారు. వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా సెంచరీలతో అదరగొట్టాడు చటేశ్వర్ పుజారా. ఇక ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండడం విశేషం టీం ఇండియాతో పాటు ఐపిఎల్ ఫ్రాంచైజీలు కూడా తనను పట్టించుకోలేదనే కసి ప్రస్తుతం పూజరాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు చటేశ్వర్ పుజారా ససెక్స్ కు ఆడుతున్న అతను మూడు మ్యాచ్ల్లో రెండు డబుల్ సెంచరీలు ఒక సెంచరీ చేసి అదరగొట్టాడు మొత్తంగా ఐదు వందల 31 పరుగులు సాధించాడు. ఇక ఇటీవలే జరిగిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో ద్విశతకం సాధించిన చటేశ్వర్ పుజారా తన జట్టుకు పటిష్టమైన స్థితిలో ఉంచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అతను 28 ఏళ్ల కిందట ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. కౌంటీలో మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ తర్వాత రెండు డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డులకెక్కాడు చటేశ్వర్ పుజారా..