జడేజా అందుకే కెప్టెన్సీ వదిలేశాడు : ధోని

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ లో ఈ ఏడాది అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ మహేంద్రసింగ్ ధోని అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజాను నియమించారు. కానీ రవీంద్ర జడేజా మాత్రం కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక 8 మ్యాచ్లలో కేవలం రెండే రెండు విజయాలు సాధించినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.


 ఒక ఆటగాడిగా కూడా రవీంద్ర జడేజా అటు కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని బాగా రాణించలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకొని మళ్లీ మహేంద్రసింగ్ ధోని కి సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. ఇటీవల ధోనీ కెప్టెన్సీలో సన్రైజర్స్ మ్యాచ్ ఆడిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ క్రమంలోనే జడేజా కెప్టెన్సీ వదిలించుకోవడం పై స్పందించిన ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ భారం రవీంద్ర జడేజా ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపిందని అందుకే నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు.



 కెప్టెన్ గా మారిన తర్వాత చాలా విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక సొంత ఆటతీరు పట్ల కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా ఆలోచనలతో కూడుకున్న వ్యవహారం.. మన మెదడు నియంత్రణలో ఉంచడం అంత సులువైన పని కాదు. శరీరం విశ్రాంతి తీసుకున్నా సరే మెదడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. జడేజా విషయంలో అదే జరిగింది.  కెప్టెన్సీ భారం అతని ఆట తీరు పై ప్రభావం చూపింది.  జడేజా గొప్ప ప్రదర్శన చేస్తాడు.. కానీ గొప్ప ఫీల్డర్ ను కోల్పోయాం.. మిడ్ వికెట్ ఫీల్డింగ్ లో సమస్యలు ఎదుర్కొన్నాము. ఇది ఎంతో ఆందోళన కలిగించింది. అందుకే కెప్టెన్సీ మార్పు చేయాల్సి వచ్చింది అంటూ ధోని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: