ఐపీఎల్ : హార్దిక్ వర్సెస్ మయాంక్.. గెలుపు ఎవరిది?
ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే తొమ్మిది మ్యాచ్ లలో ఎనిమిది విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్ బెర్తు దాదాపు ఖరారు అయిపోయినట్లే. కానీ అటు పంజాబ్ కింగ్స్ మాత్రం గత కొంత కాలం నుంచి వరుస ఓటములతో సతమతమవుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే అటు పంజాబ్ కింగ్స్ జట్టు తప్పక గెలవాల్సి ఉంది. అదే ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఒకసారి మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించి విజయం సాధించింది అని చెప్పాలి. మరి నేడు పంజాబ్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. డివై పాటిల్ స్టేడియం వేదికగా 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగబోతోంది. కాగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగు విషయాలు మాత్రమే సాధించింది. దీంట్లో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. కాగా ఒకవైపు గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉండగా అటు మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ మాత్రం ప్రతి మ్యాచ్ లో కూడా తడబడుతుంది అని చెప్పాలి..