ధోనికి కెప్టెన్సీ.. అజారుద్దీన్ ఏమన్నాడో తెలుసా?
రవీంద్ర జడేజా కెప్టెన్సీ లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవా ప్రస్థానం కొనసాగించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వరుస ఓటములతో సతమతమవుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అటు రవీంద్ర జడేజా కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా కూడా సక్సెస్ అవ్వలేదు పోయాడు. దీంతో ఇటీవలే హైదరాబాద్ జట్టుతో మ్యాచ్కి ముందు జడేజా కెప్టెన్సీ వదిలేసాడు. దీంతో మళ్లీ తిరిగి సారధ్య బాధ్యతలను చేపట్టాడు ధోని. ఇలా ధోనీ కెప్టెన్సీ చేపట్టాడో లేదో ఇక అంతలోనే మొదటి మ్యాచ్లో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.
దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ ఒక్కడే సమర్ధుడు అంటూ అందరూ ప్రశంసలు కురిపించారూ. ఇటీవలే తిరిగి ధోని కి మళ్ళి కెప్టెన్సీ రావడంపై మాజీ క్రికెటర్ అజారుద్దీన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ధోని ఏ జట్టులో ఆడిన ఆ జట్టు కెప్టెన్ గా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. చెన్నై జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో జడేజా పై కెప్టెన్సీ ఒత్తిడి తగ్గి అతని ఆటతీరు మెరుగుపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు అజారుద్దీన్. అటు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ధోనీకీ కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం..