ధోనీతో అది జరిగి తీరుతుంది : సెహ్వాగ్

praveen
ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే అభిమానులు అందరూ షాక్ అయ్యారు. ఇక రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించిన  తర్వాత చెన్నై ప్రస్థానం ఎలా ఉంటుందో అని అనుకున్నారు. ప్రేక్షకుల ఊహకందని విధంగా దిగ్గజ జట్టు చెన్నై కి పేలవా ప్రస్థానాన్ని  కొనసాగించింది. విజయాలలో అన్ని జట్ల కంటే వెనకబడి పోయింది. పాయింట్ల పట్టికలో చివరికి చేరుకుంది. దీంతో జడేజా కెప్టెన్సీ వదిలేసి మళ్ళీ ధోని సారథ్య బాధ్యతలు స్వీకరిస్తే ఎంత బాగుండు అని ప్రేక్షకులు కోరుకున్నారు. ఇక ప్రేక్షకుల బలమైన కోరిక చివరికి నెరవేరింది.


 జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ధోనీ మళ్లీ కెప్టెన్ గా అవతరించాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మొదటి బ్యాచ్ లోనే మంచి విజయాన్ని సాధించింది. 13 పరుగుల తేడాతో సన్రైజర్స్ పై విజయఢంకా మోగించింది. తనదైన మార్కు కెప్టెన్సీ తో ప్లే ఆఫ్ అవకాశలను సజీవంగా ఉంచుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారూ. ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది అని అంచనా వేశాడు.


 2005 సంవత్సరం నుంచి ధోనీతో కలిసి ఉన్నాను. ఇక అతని నేతృత్వంలోని టీమ్ ఇండియా లో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరిగాయో కళ్లారా చూశాను. ఇక టీమిండియా ఎంతో గొప్పగా నాకౌట్  లో ప్రదర్శన చేసి గెలుపొందింది. ఇక ఓడిపోతామని అనుకున్న మ్యాచ్ లలో కూడా అద్భుతమైన విజయాలను నమోదు చేశాం. ఇలా ఒక అప్పటి రోజులను గుర్తు చేసుకుంటే ఇక ఇప్పుడు ధోనీ కెప్టెన్సీలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తుంది అని అనిపిస్తోంది. ఇది జరిగి తీరుతుంది కూడా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: