అతనిలా అవ్వొద్దు.. యువ క్రికెటర్లకు కపిల్ దేవ్ సూచన?
తాత్కాలిక కీర్తిప్రతిష్టలు గుర్తింపు కారణంగా ఇక ఆట పై దృష్టి కోల్పోకూడదు అని యువ క్రికెటర్లకు హితబోధ చేశాడు దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్. సచిన్, వినోద్ కంబ్లె పాఠశాల స్థాయిలో క్రికెట్ లో అదరగొట్టారు. ఇక ఆ తర్వాత 1990లలో అంతర్జాతీయ క్రికెట్లో కూడా వినోద్ కాంబ్లీ ఆరంభంలో తన అద్భుతమైన ప్రతిభతో ఒక వెలుగు వెలిగాడు. దీంతో అతనికి ఎంతో పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం ఫామ్‌ను కోల్పోయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక. ఇక కెరియర్ను పాడు చేసుకుని క్రికెట్‌కు దూరం అయ్యాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ మాత్రం ఎన్నో రికార్డులను సృష్టించి ఉన్నత శిఖరాలను చేరుకుని ఒక గొప్ప క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే అండర్-19 ప్రపంచ కప్ ఆటగాళ్ళు రాజ్ బావ, హర్నూర్ సింగ్ తో కలిసి కపిల్ దేవ్ క్రీడా చానల్ తో మాట్లాడాడు. ఎప్పుడూ రెండు రకాల క్రికెటర్లు ఉంటారు. నేను సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ ఇద్దరితో కలిసి ఆడాను. ఇక వాళ్ళిద్దరూ కూడా టీమిండియాకు ఎమర్జింగ్ ప్లేయర్స్ లగా మారిపోతారు అని ఎప్పుడో అనుకున్నాను వినోద్ కాంబ్లీ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. కానీ ఆట పై దృష్టి పెట్టాల్సిన సమయంలో అతని ధ్యాస మళ్ళింది. దీంతో క్రికెట్ కెరియర్ అర్ధాంతరంగా ముగిసింది. వచ్చిన కీర్తిప్రతిష్టలు కూడా దూరం అయ్యాయి. క్రికెట్ లో మీ ప్రదర్శన ముఖ్యం బాగా రాణిస్తే అద్భుత క్లియర్ గా ఎదుగుతారూ. లేకపోతే అభిమానులు ప్రజలు మరచిపోయే క్రికెటర్‌గా మారతారు అంటూ కపిల్‌దేవ్ చెప్పుకొచ్చాడు..