నాకు అమ్మాయి అంటే ఇష్టం.. కానీ పెళ్లి చేసుకోను : ఆకాశ్ చోప్రా
ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే వరుసగా ఓటములతో సతమతమవుతున్న కోల్కతా జట్టుకు ఈసారి అయినా విజయం సాధిస్తుందా లేదా అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఇక కొంతమంది బ్యాట్స్మెన్లు చేతులెత్తేసిన సమయంలో యువ ఆటగాడు రింకు సింగ్ క్రీజులోకి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడి కోల్కతా జట్టుకు విజయం అందించాడు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు ఫీలింగ్ లోనూ రాణిస్తూ పరుగులను ఆపగలిగాడూ. ఈ క్రమంలోనే స్పందించిన ఆకాష్ చొప్రా రింకు సింగ్ సేవలను ఉపయోగించుకోవడంలో కోల్కతా యాజమాన్య విఫలమైంది అంటూ వ్యాఖ్యానించాడు.
అతను మెరుగ్గా రాణించి అప్పటికీ కోల్కతా యాజమాన్యం మాత్రం అతన్ని చాలా మ్యాచ్లకు దూరం పెట్టింది అని ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వాలని సూచించాడు. రింకు సింగ్ కి పెద్దగా అవకాశాలు రాకపోయినా అతను బాగా రాణించాడు. ఒక మంచి స్కోరు చేసిన ఎనిమిది లేదంటే 9వ స్థానంలో కోల్కత్తా అతని ఆడిస్తోంది. నాకు అమ్మాయి అంటే ఇష్టం.. కానీ తనను పెళ్లి చేసుకోలేను.. తను నాకు గర్ల్ ఫ్రెండ్ మాత్రమే.. ఎప్పటికీ భార్య కాలేదు అన్నట్లు రింకు సింగ్ ను వేలంలో కొంటారు. జట్టులో పెట్టుకుంటారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వరు తను బాగా బ్యాటింగ్ చేయగలడు అంటూ అకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.