బ్యాట్ విరగొట్టా.. క్రికెట్ వదిలేద్దాం అనుకున్నా : సంజూ శాంసన్

praveen
2014, 2015 ఐపీఎల్  లో మంచి ప్రదర్శన కనబరిచిన సంజూ శాంసన్  ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత 2015 లోనే జింబాబ్వే  పర్యటన సందర్భంగా భారత జట్టులో చోటు సంపాదించుకున్నాను. ఇలా ఇరవై ఏళ్ళ వయసు లోనే టీమిండియాలో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ నిలకడ లేని కారణంగా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 25 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు. అయితే నిలకడ లేమి సంజు శాంసన్  ను టీమిండియాకు దూరం చేసింది. ఈ క్రమంలోనే ఆ అనుభవాలను పంచుకున్నారు సంజూ శాంసన్.

 నాకు 20 ఏళ్ల వయసులో టీమిండియాలో ఛాన్స్ వచ్చింది. మళ్లీ పునరాగమనం చేసేందుకు 25 ఏళ్లు పట్టింది. నా జీవితంలో ఈ కాలంలో అత్యంత క్లిష్టమైనది. కేరళ జట్టు నుంచి కూడా పక్కకు పెట్టారు. ఎన్నో సవాళ్ళు ఎదుర్కున్నా. మనమీద మనకు నమ్మకం కూడా పోతుంది. అయితే నేను మాత్రం సంజు నువ్వు మళ్ళీ తిరిగి జట్టులోకి వస్తానని మనసుకి సర్ది చెప్పుకున్నాను. నిజాయితీ నమ్మకం తో అన్నీ అధిగమించగలము అంటు సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. అప్పట్లో నేను తొందరగా వికెట్ చేజార్చుకునే వాడిని.

 అలాంటి సమయంలో కోపం చిరాకు విసుగు వచ్చేవి. ఒకానొక సందర్భంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లగానే బ్యాట్ విసిరి పడేసాను. మ్యాచ్ జరుగుతుండగానే మైదానం వీడి బయటకు వచ్చేసాను. ఇక క్రికెట్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. అన్నీ అక్కడే వదిలేసి కేరళకు తిరుగు ప్రయాణం అవుదాం అనుకున్నాను. ఆ తర్వాత మేరైన్ డ్రైవ్ కి వెళ్లి సముద్రాన్ని చూస్తూ నాలో నేను ఆలోచించడం మొదలు పెట్టాను. రెండు గంటల పాటు అక్కడే కూర్చున్నాను. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లో  చూస్తే నా బ్యాట్ విరిగిపడి నామీద నాకే కోపం వచ్చింది. బ్యాట్ కాకుండా పిల్లో ని విసిరి వేయాల్సింది అనుకున్నాను. బ్యాటింగ్ మీద దృష్టి సారించి ముందడుగు వేశాను అంటూ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ ప్రతి మ్యాచ్లో కూడా రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: