అద్భుతమైన క్యాచ్ గురూ.. చూస్తే అవాక్కే?
ప్రస్తుతం పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ ఇంగ్లాండ్ కౌంటిలలో ఆడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ససెక్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మహమ్మద్ రిజ్వాన్. ఈ క్రమంలోనే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఏకంగా తన స్పిన్ బౌలింగ్ తో కూడా అందరినీ ఆకర్షించాడు.. ఇక ఇప్పుడు మెరుపు ఫీల్డింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ససెక్స్ కు ఆడుతున్న డార్హంతో జరిగిన మ్యాచ్ లో సంచలన క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.
డార్హం రెండో ఇన్నింగ్స్ లో సబ్జెక్ట్ స్పిన్నర్ రాలెన్స్ వేసిన బంతిని స్కాట్ బోర్డ్ విక్ డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లీప్ దిశగా వెళ్ళింది. ఈ క్రమంలోనే ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్ డ్రైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే మొహమ్మద్ రిజ్వాన్ పట్టిన క్యాచ్ కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది అని చెప్పాలి.