ఒక్క బంతికి 6 పరుగులు.. ఇలాంటి చెత్త ఫీల్డింగ్ ఎప్పుడు చూసుండరు?

praveen
ఎంతో ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు చిన్నపాటి పొరపాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆటగాళ్లు చేసే చిన్న పాటి పొరపాట్లే ఏకంగా భారీ మూల్యం చెల్లించుకోవడానికి కారణం గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి తప్పులు జరగకుండా ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో అలర్ట్ గా ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ఫీల్డర్లు క్యాచ్ వదిలేయటం ఇక రన్నవుట్ మిస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇలాంటిది ఇప్పటివరకు క్రికెట్లో ప్రేక్షకులు ఎవరు కూడా ఎప్పుడూ చూడలేదు చెప్పాలి.

 ఇటీవల దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సిసిఎస్ పోర్చుగల్ టి20 లీగ్ లో భాగంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కోయంబ్రా నైట్స్ ఫ్రెండ్షిప్ సీసీ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక టాస్ గెలిచిన కోయంబ్రా నైట్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఫ్రెండ్షిప్ సీసీ జట్టు నెమ్మదిగానే బ్యాటింగ్  చేస్తుంది. కానీ చివరి ఓవర్లో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రీజు లో ఉన్న బ్యాట్స్మెన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. కాగా ఫీల్డర్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఫీల్డర్ తప్పిదం చేశాడు.

 ఎక్కడ బంతి పడుతుందో అంచనా వేయలేక చివరికి ఆ క్యాచ్ పట్టుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో అటు బ్యాట్స్మెన్స్ మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే వెంటనే తేరుకుని నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు త్రో విసిరాడు. క్యాచ్ పోతే పోయింది కానీ రన్ అవుట్ అయ్యే అవకాశం మరోసారి వస్తుంది అనుకున్నారు అంతా. కానీ అంతలోపే బంతి చేజారిపోయింది. ఫీల్డర్ వేసిన వేగానికి బంతి ఎక్కడా ఆగలేదు. అయితే ఫోర్ బార్డర్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఇద్దరు ఫీల్డర్లు బంతిని ఆపేందుకు ప్రయత్నించారు. ఊహించని ట్విస్ట్ బంతిని ఎవరో ఒకరు అందుకుంటారని అనుకుంటే ఇద్దరు వదిలేసారు. ఇంకేముంది బంతి నేరుగా బౌండరీ లైన్ దాటింది. ఇలా ఒక బంతికి సిక్సర్ రూపంలో ఆటగాళ్లు తప్పిదంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: