ఆయన ప్రభావం నాపై ఉంది : సంజూ శాంసన్
అయితే ఎంతో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉన్న సంజూ శాంసన్ ఒకప్పుడు కేవలం రెండు మూడు మ్యాచ్ లలో మాత్రమే బాగా రాణించడం ఆ తర్వాత నిలకడ లేని కారణంగా పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశ పరచడం లాంటివి చేసేవాడు. కానీ ఇటీవలి కాలంలో తన బలహీనతలను అధిగమించడం చేసి నిలకడగా రాణిస్తూ ఉండటంతో అభిమానులను కూడా సంతోషంలో మునిగిపోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ లో ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తున్నాడు. ఒకవైపు కెప్టెన్గా తన వ్యూహాలతో ముందుకు నడిపిస్తూనే మరోవైపు ఆటగాడిగా మంచి స్కోరు చేస్తూ జట్టు విజయంలో భాగం అవుతున్నాడు.
ఇకపోతే ఇటీవల సంజూ శాంసన్ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ రాజస్థాన్ జట్లకు రాహుల్ ద్రావిడ్ మెంటార్ గా ఉన్న సమయంలో అతనితో కలిసి చేసిన ప్రయాణం తన కెరీర్లో ఎంతో ప్రభావం చూపుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ యువ క్రికెటర్లు ఎంతో ప్రోత్సహించేవారు అని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేటప్పుడు కరుణ్ నాయర్ శ్రేయస్ అయ్యర్ మయాంక్ అగర్వాల్ రిషబ్ పంత్ తో పాటు నన్ను కూడా పిలిచి మీరు తప్పకుండా టీమిండియాకు ఆడతారు అని నమ్మకం నాకు ఉంది అంటూ చెప్పేవారు అంటూ గుర్తుచేసుకున్నాడు సంజూ శాంసన్.