వారెవ్వా.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన శిఖర్ ధావన్?

praveen
టీమిండియాలో ఇటీవలి కాలంలో పోటీ పెరిగిపోయిన నేపథ్యంలో సీనియర్ స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఇక టీమిండియా జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడాల్సినా పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ టీమిండియా తరపున ఆడి చాలా రోజులు అయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ వేదికగా తన మంచి ఫామ్  నిరూపించుకునే ప్రయత్నం చేయడానికి శిఖర్ ధావన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది వరకు ఢిల్లీ కాపిటల్స్ జట్టు తరఫున ఆడిన శిఖర్ ధావన్ ఇక ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా మంచి పరుగులు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.


 ఇక పంజాబ్ కింగ్స్  బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేసినప్పటికీ శిఖర్ ధావన్ మాత్రం భారీ స్కోరు ఎప్పుడూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది  వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జుట్టుకు పంజాబ్ షాక్ ఇచ్చింది.


 అయితే ఇలా గుజరాత్  తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి సత్తా చాటాడు. ఈసారి ఏకంగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేసాడు శిఖర్ ధావన్. ఐపీఎల్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన వారిలో విరాట్ కోహ్లీ అధిగమించి శిఖర్ ధావన్ రెండవ స్థానానికి చేరుకున్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్లో 48 హాఫ్ సెంచరీలు చేస్తే శిఖర్ ధావన్ 49 హాఫ్ సెంచరీలు చేశాడు. శిఖర్ ధావన్ కంటే ముందు అటు డేవిడ్ వార్నర్ 57 అర్థ సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ నాల్గవ స్థానంలో డివిలియర్స్ ఐదవ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: