ధోని ముందు అరుదైన రికార్డు.. మరో ఆరు పరుగులు చేస్తే?
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోని జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో మళ్ళీ సారథ్య బాధ్యతలను చేపట్టాడు. ఇటీవల హైదరాబాదు జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడం గమనార్హం. కాగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీని ఇక ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తోంది. మరో 6 పరుగులు చేస్తే చాలు ఒక అరుదైన మైలురాయిని అందుకో బోతున్నాడు మహేంద్రసింగ్ ధోని.
ప్రస్తుతం భారత క్రికెట్లో టి20లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే మరో ఆరు పరుగులు చేశాడు అంటే మహేంద్ర సింగ్ ధోనీ కూడా టి 20 లలో 6 వేల పరుగుల మైలురాయిని అందుకోబోతున్నారు అనే చెప్పాలి. ఆరు వేల పరుగులు చేసిన రెండో కెప్టెన్ గా రికార్డు సృష్టించబోతున్నాడు ధోనీ. ఇప్పటి వరకు 185 ఇన్నింగ్స్ లో 5994 పరుగులు చేశాడు ధోని. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో ధోనీ ఈ ఘనత సాధించే అవకాశముంది.