ఐపిఎల్ : భారీ సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీళ్లే?

praveen
సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటేనే ధన ధన్ ఫటాఫట్ అనే ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఒక టి20 ఫార్మాట్ లో ఎక్కువగా బ్యాట్మెన్స్ దే ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఎంతో మంది. ఇక బౌలర్లు ఎక్కడ బంతి వేసినా దానిని బౌండరీ తరలించడమే లక్ష్యంగా బాడ్మింటన్ బరిలోకి దిగితూ ఉంటారు అని అంటూ ఉంటారు. నిజంగానే టీ-20 ఫార్మెట్లో బ్యాట్మెన్స్ బౌలర్లపై విరుచుకుపడే తీరు చూస్తుంటే అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ మజా అందుతు ఉంటుంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అటు బిసిసిఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ చూస్తూ ఉంటాం. కేవలం అంతర్జాతీయ క్రికెట్లో సీనియర్ లుగా కొనసాగుతున్న వారు మాత్రమే కాదు ఐపీఎల్ లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు  సైతం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ సిక్సర్లు ఫోర్లతో ఏకంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లివింగ్ స్టోన్ 117 మీటర్ల సిక్సర్ కొట్టి వార్తల్లో నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఇదే పెద్ద సిక్స్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో ఇప్పుడు వరకు భారీ సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించిన ప్లేయర్లు ఎవరు అన్న విషయం తెరమీదకి వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే యూనివర్సల్ బాస్ గా పేరు సంపాదించుకున్న సార్ హిట్టర్ క్రిస్ గేల్ ఐపీఎల్ లో అత్యంత పెద్ద సిక్స్ కొట్టిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. ఏకంగా 119 మీటర్ల సిక్సర్ కొట్టాడు. ఇది ఇప్పటివరకు అతి పెద్ద సిక్స్ గా కొనసాగుతుంది. ఆ తర్వాత బెన్ కటింగ్ 117 మీటర్లు సిక్సర్ కొట్టి రికార్డు సృష్టించాడు. ఇక ఇటీవల లివింగ్ స్టోన్ సైతం 117 మీటర్లు సిక్స్  కొట్టడం గమనార్హం. ఆ తర్వాత డేవాల్ట్ బ్రేవిస్ 112 మీటర్లు ఎంఎస్ ధోని 112 మీటర్లు ఏబి డివిలియర్స్ 111 మీటర్ల సిక్సర్లు కొట్టి అతిపెద్ద సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: