ఐపీఎల్ : నేడు మనోళ్ల మ్యాచ్.. ఏం చేస్తారో?

praveen
బాబోయ్ మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్రతి మ్యాచ్ కూడా ఊహించని ఉత్కంఠ పెంచుతోంది.  స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులను కన్నార్పకుండా చేస్తూ ఉంటే అటు ఇంట్లో టీవీల ముందు కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న వారికి టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. అంత ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ప్రతి మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.

 దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లో భాగంగా మరో ఆసక్తికర పోరు జరగబోతుంది. ఢిల్లీ కాపిటల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ పై అటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది. దీంతో ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.


 అదే సమయంలో ఢిల్లీలో క్యాపిటల్స్ కూడా విజయం సాధించాలనే కసితో ఉంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. స్టేడియంలో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించినా సన్రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచ్ లలో గెలిచింది. కాగా టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గుచూపుతోంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు ఆడినా తొమ్మిది మ్యాచ్లలో సన్రైజర్స్ ఎనిమిది సార్లు  టాస్ గెలిచింది. పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ ఐదవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: