అతనికి ప్రస్తుతం సపోర్ట్ కావాలి : వీరేంద్ర సెహ్వాగ్

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. ఇకపోతే గుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రతి ఒక ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడూ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గా కొనసాగుతున్న శుబ్ మన్ గిల్ మొదట కొన్ని మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు.


 అద్భుతమైన బ్యాటింగ్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు కనిపించాడు. కానీ గత మ్యాచ్ ల నుంచి మాత్రం వరుసగా పేలవ ప్రదర్శన చేస్తూ నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల శుబ్ మన్ గిల్ ప్రదర్శనపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కాగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ ల పై తనదైన శైలిలోనే కామెంట్ చేస్తూ ఉంటాడు.


 ఇకపోతే ఇటీవల శుబ్ మన్ గిల్ ఫామ్ గురించి మాట్లాడుతూ అతను మళ్లీ రాణించాలి అంటే గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం  అతని ప్రోత్సహించాలి అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. నీకు ఎలా వీలైతే అలా ఆడు.. 120 లేదా 150 స్ట్రైక్ రేట్ అనేది నీ ఇష్టం అని యాజమాన్యం అతనికి చెప్పాలి. శుబ్ మన్ గిల్ ఏడు నుంచి ఎనిమిది ఓవర్లు బ్యాటింగ్ చేస్తే తర్వాత వచ్చే మిల్లర్ తేవాటియా లకు ఎంతో సులభం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. కాగా తొలి మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన శుబ్ మన్ గిల్ ఆ తర్వాత 84, 96 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆడిన అన్నీ మ్యాచ్ లలో  కూడా అతను రాణించలేకపోయాడు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: