రోహిత్ శర్మ సిక్సర్.. ఖడ్గ మృగాలకు 5 లక్షలు?

praveen
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి పూర్తిగా విఫలం అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఎక్కడ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు రోహిత్ శర్మ. ప్రపంచ క్రికెట్లో టాప్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు వరకు ఏ మ్యాచ్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో రోహిత్ శర్మ ఒక అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడూ. ఇటీవలే గుజరాత్  తో జరిగిన మ్యాచ్ లో మాత్రం రోహిత్ శర్మ పర్వాలేదనిపించాడు.


 28 బంతుల్లో ఏకంగా 43 పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఇందులో 5 ఫోర్లు 2 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఫుల్ స్వింగ్లో కనిపిస్తున్న రోహిత్ శర్మ భారీ స్కోరు చేయడం పక్క అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా వికెట్ కోల్పోయాడు. ఇక రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో కొట్టిన రెండు సిక్సర్లు  కూడా హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా అల్జారీ జోసెఫ్ వేసిన బంతిని అలవోకగా బౌండరీ దాటించాడు రోహిత్ శర్మ. ఇక సిక్స్  నేరుగా వెళ్లి మైదానంలో ఉన్న టాటా పంచ్ కార్ కు తగిలింది. దీంతో ఇక ఏకంగా ఐదు లక్షలు వచ్చాయి. అదేంటి సిక్సర్ కొడితే ఐదు లక్షలు రావడం ఏంటి అని కన్ఫ్యూజన్ లో మునిగి పోయారు కదా.


 ప్రస్తుతం ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతున్న టాటా మోటార్స్ మైదానంలో టాటా పంచ్ కార్ ను ఉంచుతుంది అన్నది తెలిసిందే. అయితే ఇక ఎవరైనా ఆటగాడు ఆ కారుకు తగిలేలా సిక్సర్ కొడితే  ఏకంగా అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ కి ఐదు లక్షలు విరాళంగా ఇస్తాము అంటూ  టాటా సంస్థ ప్రకటించింది. కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గ మృగాలకు అభయారణ్యం కావడం గమనార్హం. కాగా రోహిత్ శర్మ కార్ కు తగిలేలా సిక్సర్ కొట్టడం తో ఐదు లక్షలు ఖడ్గమృగాలా పరిరక్షణ కోసం టాటా మోటార్స్ ఇవ్వనుంది. ఇలా రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ ఒక మంచి పనికి కారణం అయింది అని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: