అస్సలు అచ్చిరాని జెర్సీలో RCB.. ఏం జరుగుతుందో?

praveen
2022 ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సత్తా చాటుతోంది అన్న విషయం తెలిసిందే. దాదాపు 14 సీజన్ల నుంచి కలగానే మిగిలిపోయినా ఐపీఎల్ టైటిల్ ఈ సారి గెలిచే లాగే కనిపిస్తుంది. ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయపరంపర కొనసాగిస్తూ వస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇప్పటివరకు 2022 ఐపీఎల్ సీజన్ లో భాగంగా 11 మ్యాచులు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.



 కాగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడబోతుంది బెంగళూరు జట్టు. అయితే గతంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగగా ఘోర ఓటమి చవిచూసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకుంటుంది అని అందరూ అనుకుంటున్న వేళ అభిమానులందరికీ ఊహించని వార్త తెలిసింది. ప్రతి ఏటా ఓ మ్యాచులో రెగ్యులర్ జెర్సీ కాకుండా కొత్త జెర్సీలో ఆర్సిబి బరిలోకి దిగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో ఆకుపచ్చ కలర్ జెర్సీ ధరించి మ్యాచ్ ఆడుతూ  ఉంటుంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడబోయే మ్యాచ్ లో కూడా ఈ కొత్త జెర్సీ తోనే కనిపించనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.



 అయితే ఇక ఈ గ్రీన్ కలర్ జెర్సీ ఇప్పటివరకు ఆర్సిబి కి పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ జెర్సీ లో ఆడిన 10 మ్యాచుల్లో 7 మ్యాచ్ లలో ఓడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. రెండు మ్యాచ్లలో విజయాలు సాధించింది.. ఇక మరో  మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది అని చెప్పాలి. ఇక 2021 సీజన్లో బ్లూ జెర్సీ తో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి చవిచూసింది. దీంతో అస్సలు కలిసి రాని గ్రీన్ జెర్సీ తో బరిలోకి దిగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అసలు గెలుస్తుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: