పగబట్టారు.. అందుకే కెప్టెన్ కాలేకపోయా : యువరాజ్
కొన్నాళ్లపాటు టీమిండియాకు వైస్ కెప్టెన్ గా పనిచేసిన ఎక్కువ కాలం మాత్రం ఆ హోదాలో ఉండలేదు. తనకు కెప్టెన్సీ రాకపోవడంతో ఇటీవల యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సారథ్య బాధ్యతలను అందుకోలేకపోయాను అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గ్రెగ్ చాపెల్ ఉదంతం టీమిండియా కెప్టెన్సీ నుంచి నన్ను దూరం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. చాపెల్ 2005 నుంచి 2007 మధ్యలో టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
అప్పట్లో హెడ్ కోచ్ చాపెల్ తీసుకున్న నిర్ణయాలను జట్టులో సీనియర్ గా ఉన్న సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టారు. 2007 వరల్డ్ కప్పు ముందు బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతో జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. దాంతో చాపెల్ తో పోసగకపోవడమే గంగూలీ రిటైర్మెంట్ కావడానికి కారణమైంది. 2007లో అందుబాటులో సెహ్వాగ్ లేకపోవడంతో ద్రవిడ్ కెప్టెన్గా నేను వైస్ కెప్టెన్ గా ఉన్నాము. సీనియర్లకు చాపెల్ వివాదాలు రావడంతో నేను మా టీం కి సపోర్ట్ చేయడం కొంతమంది పెద్దలకు నచ్చలేదు. దీంతో తాను తప్ప ఇంకెవ్వరు కెప్టెన్గా ఉన్న అభ్యంతరం లేదని కొంతమంది పట్టుబట్టారు. కొంతమంది నాపై పగబట్టారు. అందుకే కెప్టెన్ కాలేకపోయాను. వాస్తవానికి అయితే 2007 టి20 ప్రపంచ కప్పుకు నేను కెప్టెన్ గా ఉండాల్సింది అంటు యువరాజ్ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు అని తెలిపాడు.