ఐపీఎల్ : ఎక్కువసార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్లు ఇవే?

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం అసలుసిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ప్రతి జట్టు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండడం చూసి ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. సాధారణంగా ఐపీఎల్లో 200 స్కోరు నమోదు చేయడం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. బ్యాట్స్మెన్లు  సమిష్టిగా రాణించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పుడు మాత్రమే ఈ రికార్డు సాధించడం సాధ్యం అవుతుంది అని చెప్పాలి.


 కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు పలు జట్లు 200 పరుగుల మైలురాయిని అందుకున్నాయి. ఇక ఇలాంటి భారీ లక్ష్యాన్ని అటు ప్రత్యర్ధి జట్టు చేధించటం కష్టమే కాని కొన్నిసార్లు ప్రత్యర్థులు సైతం ఊహించని విధంగా అద్భుతంగా రాణించి 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇకపోతే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 209 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ 200కు పైగా పరుగులు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎక్కువ సార్లు 200 ప్లస్ స్కోరు చేసిన జట్లు ఏవి అన్నది ప్రస్తావనకు వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


 ప్రస్తుతం ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకూ ఐపీఎల్ లో 23 సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 21సార్లు 200 కు పైగా పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టు 16సార్లు 200 ప్లస్ మార్కును అందుకుంది. ఇక ముంబై ఇండియన్స్ సైతం 16 సార్లు రెండు వందలకు పైగా పరుగులు చేయడం గమనార్హం. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 14 సార్లు, రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 సార్లు ఇలా ఐపీఎల్లో 200 స్కోర్ చేసాయ్.  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పదిసార్లు ఐపీఎల్ హిస్టరీలో 200 ప్లస్ పరుగులు చేసిన జట్లుగా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: