ముంబై ఓడినా.. భళా అనిపించిన బుమ్రా?

praveen
బుమ్రా ప్రస్తుతం టీమిండియా లో కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ ద్వారా ప్రస్థానం మొదలుపెట్టిన జస్ప్రిత్ బూమ్రా తక్కువ సమయంలోనే తన బౌలింగ్ ప్రతిభతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇక టీమిండియాలో అడపాదడపా ప్రదర్శన చేయకుండా అక్కడ అద్భుతమైన ప్రదర్శన చేసి అదరగొట్టాడు జస్ప్రిత్ బూమ్రా.  ఈ క్రమంలోనే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. టీమిండియాకు డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదండోయ్ ఇక జస్ప్రిత్ బూమ్రా సంధించే యార్కర్ లకు అటు బ్యాట్స్మెన్ ల దగ్గర  దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు అని చెప్పాలి.


 అయితే అటు ఐపీఎల్ లో కూడా ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా అదరగొడుతున్నాడు అని చెప్పాలి. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్మెన్లను భయపెడుతూ ఉంటాడు. కానీ కొంతకాలం నుంచి జస్ప్రిత్ బూమ్రా మాత్రం సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో వరుస ఓటములతో సతమతమవుతున్న నేపథ్యంలో బుమ్రా కూడా ఒత్తిడి లో ఎక్కువ వికెట్లు తీయలేక పోతున్నాడు అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 51 పరుగుల తేడాతో కోల్కత ఘన విజయం సాధించింది.

 ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయినప్పటికీ ఆ జట్టు బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భళా అనిపించాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇందులో ఒక మేడిన్ కూడా ఉండడం గమనార్హం. ఐపీఎల్ లో 5 వికెట్లు తీయడం జస్ప్రిత్ బూమ్రా కి ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే జస్ప్రిత్ బూమ్రా కట్టడి చేయడంతో తొలి 11 ఓవర్లలో 100  పరుగులు చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి మాత్రం  నూట అరవై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: