రోహిత్ శర్మ వికెట్.. ఐపీఎల్ లో మరో వివాదం?

praveen
ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతోమంది అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆయా జట్లకు శాపంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై అటు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల మరోసారి థర్డ్ అంపైర్ నిర్ణయం ఒక బ్యాట్స్మెన్  ని కొంపముంచింది. ఆ బ్యాట్స్మెన్ ఎవరో కాదు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కావడం గమనార్హం. ఇటీవల ఐపీఎల్ లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ మ్యాచ్లో భాగంగా రోహిత్ శర్మ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్  తీసుకొన్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ తాజా నిర్ణయం కాస్త కొత్త వివాదానికి తెరలేపింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ శర్మ లెఫ్ట్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళుతూ అతడి తొడ భాగాన్ని సమీపంగా వెళ్ళింది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ కీపర్ షెల్టన్ జాక్సన్ తన కుడి వైపు అద్భుతం గా డైవ్ చేస్తూ క్యాచ్ పూర్తి చేశాడు. కేకేఆర్ ఆటగాళ్లు అవుట్ అంటూ సంబరాలు చేసుకున్నారు. ఫీల్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే శ్రేయస్ అయ్యర్ రివ్యూ కి వెళ్ళాడు.


 రివ్యూ లో బంతి రోహిత్ బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్ళింది. ఆల్ట్రా సౌండ్ లో చూసినప్పుడు బంతి బ్యాట్ కు దూరంగా ఉన్నప్పటికీ స్పైక్ కనిపించింది. ఇక బ్యాట్ కు సమీపంలోకి వచ్చినపుడు ఆ స్పైక్ మరింత ఎక్కువైంది.  దీంతో థర్డ్ అంపైర్ అవుట్ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే బంతి బ్యాట్ కు చాలా దూరం ఉన్న సమయంలో కూడా ఆల్ట్రా ఏడ్జ్ సౌండ్స్ లో స్పైక్ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయం తో రోహిత్ శర్మ షాక్ లో మునిగిపోయాడు. చివరకు చేసేదేమి లేక నిరాశతో పెవిలియన్ చేరాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: