'బెంగళూర్ - పంజాబ్' ఏది ఓడినా డేంజర్ జోన్ లో పడ్డట్టే ?
అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం లక్నో సులభంగానే ప్లే ఆప్స్ కు చేరుతుంది. ఇక కేవలం రెండు స్థానాల కోసం 6 జట్లు పోటీ పడొచ్చని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మరియు పంజాబ్ కింగ్స్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రోజు మ్యాచ్ లో ఫేవరేట్ అంటే బెంగళూర్ అనే చెప్పాలి. కానీ హార్డ్ హిట్టర్లు ఉన్న పంజాబ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ప్రస్తుతం డుప్లిసిస్ నాయకత్వం వహిస్తున్న బెంగుళూరు పాయింట్ల పట్టికలో 12 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒక మ్యాచ్ గెలిచి కొంచెం రన్ రేట్ ను తెచ్చుకున్నా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.
కానీ పంజాబ్ కు మాత్రం ఆశలు చాలా తక్కువ అని చెప్పాలి. ప్రస్తుతం పంజాబ్ ఆడిన 11 లో 5 మాత్రమే గెలిచి 10 పాయింట్లతో 8 వ స్థానంలో ఉంది. ఇక మిగిలిన త్రీ మ్యాచ్ లలో గెలిచినా పాయింట్లు 16 అవుతాయి. అప్పుడు భారీ రన్ రేట్ ను సాధిస్తే మిగిలిన జట్లతో పోటీ పడొచ్చు. మరి ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరి పరం అవుతోందో చూడాలి.