బెంగళూరు ప్లే ఆఫ్ చేరుతుందా.. సమీకరణాలు ఏం చెబుతున్నాయంటే?
ఇప్పటి వరకు 7 విషయాలు ఆరు పరాజయాలతో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ రన్ రేట్ 0.210 బెంగళూరు రన్ రేట్ -0.313 కన్నా మెరుగ్గా ఉంది.ఈ బెంగళూరు జట్టు తర్వాత మ్యాచ్ లలో భారీ తేడాతో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇతర జట్ల జయాపజయాల పై కూడా బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం ఆధారపడి ఉంది. ప్రస్తుతం పంజాబ్ ఆరు గెలిచి ఆరు ఓటమిపాలైంది. బెంగుళూరు కంటే రన్ రేట్ మెరుగ్గానే ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ లు గెలుస్తే మూడు లేదా నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకునె అవకాశం ఉంది. 11 మ్యాచ్లు ఆడి 5 విషయాలు 6 స్థానంలో ఉంది సన్రైజర్స్. మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉండగాఅన్నీ గెలిస్తే ప్లే ఆఫ్ లో చోటు దక్కే అవకాశం ఉంది.
ఇక కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లలో 7 ఓటములతో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక ఈ జట్టుకు టెక్నికల్ గా అవకాశం ఉంది. కనుక తదుపరి మ్యాచ్లలో విజయం సాధించిన 14 పాయింట్లు వస్థాయి. అదే సమయంలో అటు రాజస్థాన్ బెంగళూరు 14 పాయింట్లతో సాగుతుండడంతో ఈ జట్టుకు అవకాశం అసాధ్యమని చెప్పాలి. బెంగళూరు ప్లే ఆఫ్ నిలవాలంటే ఢిల్లీ పంజాబ్ నుంచి పోటీ ఉంది ఎందుకంటే ఈ రెండు జట్లు మెరుగ్గా రాణిస్తున్నాయ్. మరోవైపు బెంగళూరు తేలిగ్గా ప్లే ఆఫ్ చేరే ఇంకో మార్గం ఉన్నది. ఇప్పుడు టాప్ లో ఉన్న గుజరాత్ లక్నో రాజస్థాన్ చెరో మ్యాచ్ గెలిచినా వరుసగా 20,18, 16పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలుస్తాయి. ఇంకా తర్వాత ఢిల్లీ పంజాబ్ హైదరాబాద్ కోల్కతా ఒక్కో మ్యాచ్ ఓడిన బెంగళూరుకి కలిసొస్తుంది.