కోహ్లీ వికెట్ తీయడం ఆనందంగా ఉంది.. కానీ అతని లక్ మారుతుంది?

praveen
ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ లో జట్టును గెలిపించేందుకు అలుపెరుగని వీరుడిగా పోరాడేవాడు విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ స్కోరు అందించేందుకు నిరంతరం శ్రమించే వాడు. కానీ ఈ ఏడాది మాత్రం కోహ్లీ బెంగళూరు జట్టుకు మైనస్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఒక్క మ్యాచ్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచలేదు విరాట్ కోహ్లీ. దీంతో ప్రతి మ్యాచ్లో కూడా నిరాశ పరుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ ఆటతీరుపై ప్రస్తుత అభిమానులు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని మ్యాచ్ లలో అయితే కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే విరాట్ కోహ్లీ డక్ అవుట్ గా వెనుతిరుగుతున్న  తీరు చూసి ఇక మరింతలా అసంతృప్తి చెందుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు. అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ లో ఉండడానికి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.


 ఇకపోతే ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పూర్తిగా విఫలమైంది బెంగళూరు. 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 55 పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్ జట్టు.  అయితే ఈ మ్యాచ్లో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు కనిపించాడు . కానీ వికెట్ చేజార్చుకున్నాడు. అయితే ఇదే విషయంపై స్పందించిన  పంజాబ్ యాజమాన్యం  కోహ్లీ వికెట్ తీయడాన్ని ఆస్వాదించామని.. అయితే త్వరలోనే అతను లక్ మారుతుందని ఫామ్ లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: