ఐపీఎల్ : రోహిత్ శర్మ అందులో కూడా టాపే?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అటు ముంబై ఇండియన్స్ జట్టు ఛాంపియన్ గా కొనసాగుతుంది అంటే.. ఐదు సార్లు టైటిల్ గెలిచింది అంటే.. ఎప్పుడూ పటిష్టంగా కనిపిస్తూ అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థి జట్టు లో వణుకు పుట్టిస్తుంది అంటే.. దానికి కారణం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పాలి. రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టుకు భారీ స్కోరు అందించటమే కాదు తన కెప్టెన్సీని వ్యూహాలతో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది కూడా ముంబై ఇండియన్స్ జట్టు సత్తా చాటుతూ టైటిల్ పోరులో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తుంది.

 ఇలా ఇప్పటివరకు రోహిత్ శర్మ తన కెప్టెన్సీ సామర్థ్యం ఏమిటి అన్న విషయాన్ని ఐపీఎల్ టైటిల్స్ ద్వారా నిరూపించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే అటు కేవలం కెప్టెన్గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ ఎప్పుడూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

 ఇక పదిహేనేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ ఎక్కువసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఆటగాళ్ల లిస్టు చూస్తే 18 సార్లు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని 17 సార్లు మాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఇక టీం ఇండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ 16సార్లు ఈ ఫీట్ సాధించాడు. బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సురేష్ రైనా కూడా కోహ్లీ తో సమానంగా 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: