అయ్యబాబోయ్.. పుట్టగొడుగులు ప్రాణాలు తీస్తున్నాయి?

praveen
భారత్ అభివృద్ధిలో తమ కంటే ముందుకు దూసుకు పోకూడదు అనే ఉద్దేశంతో భారత్ పై ఎప్పుడూ ఏదో ఒక కుట్రలు పన్నుతూ ఉంటుంది  చైనా. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా చేయడం కూడా ఈ కుట్రలో భాగం అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ అనే బయో వెపెన్ ఉపయోగించి భారత్ను పూర్తిగా నాశనం చేయాలని భావించింది. కానీ అనూహ్యంగా భారత ప్రభుత్వం కరోనా వైరస్ మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చైనా భారత్ విషయంలో మరో సరికొత్త కుట్రపన్నుతోందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే ఇదే అనుమానం వస్తుంది.

 ఎందుకంటే ఇటీవలే చైనాసరిహద్దు రాష్ట్రాల్లోని  కొన్ని ప్రాంతాలలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఎవరూ ఊహించని విధంగా అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పుట్టగొడుగులు తిని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అని తెలుస్తోంది. అయితే అక్కడి ప్రజలందరూ కూడా ఇలా పుట్టగొడుగులు తినటం ఎన్నో ఏళ్ల నుంచి అక్కడి ప్రజలకు అలవాటు అయింది. కానీ గత రెండు సంవత్సరాల నుంచి మాత్రం కేవలం పుట్టగొడుగులు తినటం  కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

 దాదాపు ఏడాదికి 80 మంది నుంచి 100 మంది వరకు కూడా ఇలా కేవలం పుట్టగొడుగులు తింటూ ప్రాణాలు కోల్పోతూ ఉండడం మాత్రం సంచలనంగా  మారిపోయింది. చైనా భారత్ పై కుట్రలో భాగంగా ఎన్నో ప్రయోగాలు చేస్తుందని.. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు అస్సాం ప్రాంతంలో పుట్టగొడుగులు కారణంగా ప్రాణాలు కోల్పోవడం కూడా చైనా చేసిన కుట్ర అని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా 100 మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: