పటిదార్ మరో రికార్డు.. ఏకైక భారత ప్లేయర్?
అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్నారు. ఐపీఎల్ సూపర్ హీరోలుగా పేరు సంపాదించుకున్నారు. మాజీ ఆటగాళ్లతో ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటుంది అనుకున్న సమయంలో ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సరికొత్త యువ ఆటగాడు ఒక్కసారిగా తెరమీదికి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో సిసోడియా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో చోటు దక్కించుకున్న రజత్ పటిదర్ ఏకంగా ఎలిమినేటర్ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు.
లక్నో బౌలర్లపై వీరవిహారం చేసి 49 బంతుల్లోనే సెంచరీ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ప్లే ఆఫ్ మ్యాచ్ లో సెంచరీ చేసిన మొదటి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఇక ఇటీవలే రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టేశాడు. ఇక మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ప్లే ఆఫ్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఎలిమినేటర్, రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లలో కలుపుకొని 170 పరుగులు చేశాడు రజత్ పటిదర్. ఓవరాల్గా 2016 ప్లే ఆఫ్ లో 190 పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ మొదటి స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం..