లివింగ్ స్టోన్ కొడితే స్టేడియం బయటకు వెళ్లాల్సిందే.. వైరల్ వీడియో?
అక్కడ కూడా తన అద్భుతమైన ప్రదర్శన తో అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఐపీఎల్ తరహాలోనే ఇంగ్లీష్ టీ20 బ్లాస్ట్ లో కూడా భారీ సిక్సర్ కొట్టి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రస్తుతం టీ20 బ్లాస్ట్ లో భాగంగా లాక్ షైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా యార్క్ షైర్ తో జరిగిన మ్యాచ్‌లో లివింగ్ స్టోన్ ఒక భారీ సిక్సర్ కొట్టగా ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. లాంక్ షైర్ ఇన్నింగ్స్ సమయంలో 12 ఓవర్ వేసాడు మాథ్యూ రెవిస్. అతని బౌలింగ్ లో ఆఖరి బంతి లివింగ్‌స్టోన్ సిక్సర్ కొట్టాడు. బంతి స్టేడియం బయట పడటం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వీడియోని టీ20 బ్లాస్ట్ మేనేజ్మెంట్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం ఇది క్రికెట్ అభిమానులందరినీ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ వీడియో. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న లివింగ్ స్టోన్ 23 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. కాగా ఐపీఎల్లో లివింగ్ స్టోన్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసిన అభిమానులు సైతం ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లివింగ్ స్టోన్ ఒక్కసారి బ్యాట్ జులిపిస్తే అంతే బంతి స్టేడియం బయటికి వెళ్లాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు..