అభిమాని కోరిక తీర్చిన ట్రెంట్ బౌల్ట్.. జెర్సీ విప్పీ?
ఈ క్రమంలోనే ఏకంగా తమ వస్తువులను లేదా తమ జెర్సీలను బహుమతులుగా ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సైతం ఇలా అభిమాని కోరికను నెరవేర్చాడు. ఏకంగా తన ఒంటి మీద ఉన్న జెర్సీ ఇచ్చేశాడు. ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు జట్ల మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నిరాశ ఎదురైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి.
మ్యాచ్ పూర్తయిన సందర్భంగా విజయానందంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అందరూ కూడా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఒక బాలుడు స్టేడియం నుంచి ఇక రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్ అని పలకరించాడు. మీ జెర్సీ నాకు ఇస్తారా సార్ అంటూ ఎంతో క్యూట్ గా అడిగాడు. దీంతో ట్రెంట్ బౌల్ట్ ఆ బాలుడి కోరికను కాదనకుండా తన ఒంటిపై ఉన్న రాజస్థాన్ జట్టు జెర్సీని తీసి ఇచ్చాడు. దీంతో వెంటనే ఆ బాలుడు తన ఒంటిపై ఉన్న బెంగళూరు జెర్సీ తీసేసి బౌల్ట్ ఇచ్చిన జెర్సీ ధరించి సంతోషం లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..