అదృష్టమంటే అతనిదే.. ఆడకపోయినా టైటిల్ గెలిచాడు?

praveen
ఐపీఎల్ 2022  సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ను ఎగరేసుకుపోయింది అన్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ మాత్రం ఎక్కడ ఒత్తిడి లేకుండా సీనియర్ జట్లను  చిత్తు చేసి చివరికి టైటిల్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ విజేతగా నిలవడంతో జట్టులోనే ఏ ఆటగాడు ఎంతమేరకు పాత్ర పోషించాడు అన్న విషయాన్ని కూడా చర్చించుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లపై ప్రశంసలు కూడా కల్పిస్తున్నారు. అదే సమయంలో సరిగా ఆడకపోయినా ఏకంగా టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న విజయ్ శంకర్ గురించి కూడా చర్చించుకుంటున్నారు. మెగా వేలంలో విజయ శంకర్ ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎందుకొ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మాత్రం ఏకంగా 1.4 కోట్లు పెట్టి అతని కొనుగోలు చేసింది. అయితే మల్టీ డైమెన్షనల్ ప్లేయర్ గా ముద్ర వేసుకున్న విజయ్ శంకర్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఏ రోజు కూడా బాగా రాణించింది లేదు.


 అయితే ఈ సీజన్లోనే గుజరాత్ తరపున నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడిన విజయశంకర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతని ఆటతీరు జట్టు భారం కావడంతో అతని పక్కన పెట్టేశారు. అదృష్టం కలిసి వస్తే మ్యాచ్ ఆడకపోయినా టైటిల్ కొల్లగొట్టవచ్చు అనటానికి విజయ శంకర్ ఉదాహరణ అని చెప్పాలి. 2016లో సన్రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్నాడు విజయ్ శంకర్. ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఇప్పుడు గుజరాత్ టైటిల్ గెలిచిన జట్టులో ఉన్నాడు. ఇక నాలుగు మ్యాచ్లు ఆడిన పెద్దగా ప్రయోజనం లేదు. ఇలా ఆడకపోయినా టైటిల్ గెలవడం లాంటి రికార్డు కేవలం విజయ్ శంకర్ కే సాధ్యం అయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: