జట్టులో అతను దండగా.. ఎందుకు ఆడించారో?
అంతేకాదు ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కొనసాగించిన రాజస్థాన్ రాయల్స్ తరఫున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రియాన్ పరాగ్ మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్క మ్యాచ్లో కూడా జట్టుకు అతని ప్రదర్శన ఉపయోగపడలేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఫైనల్ మ్యాచ్లో కూడా ఏకంగా బౌలర్ అశ్విన్ బ్యాటింగ్ కు వచ్చిన తర్వాత రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటే జట్టులో అతని స్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో అసలు రియాన్ పరాగ్ ఏం రోల్ పోషించాడు అన్నది క్లారిటీ లేదు అంటూ చెబుతున్నారు. అయితే గత సీజన్లో కొన్ని మంచి ఇన్నింగ్స్ లతో పేరుపొందాడు రియాన్ పరాగ్. ఈ ఏడాది సీజన్ లోను బాగా రాణిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులు అయిపోయాయ్. 15 మ్యాచ్ లలో ఒకే ఒక అర్ధ శతకం తో 183 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా రియాన్ పరాగ్ ప్రదర్శన చేయకపోతే ఇక జట్టు లో ఉండి ఏం లాభం అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.