ఐపీఎల్ : తక్కువ వయసులో టైటిల్ గెలిచిన కెప్టెన్లు వీరే?
ఎందుకంటే ఎంతో తక్కువ వయసులోనే ఐపీఎల్ లో ఒక జట్టుకు కెప్టెన్ గా మారి జట్టును తన వ్యూహాలతో ముందుకు నడిపించి సత్తా చాటేందుకు వీలు ఉంటుంది. తద్వారా అంతర్జాతీయ కెప్టెన్సీకి తాను సమర్థుడినే అని అందరికీ నిరూపించుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటికే ఎంతోమంది యువ ఆటగాళ్లు గా ఉన్నప్పుడు కెప్టెన్సీ అందుకునీ అదరగొట్టారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా తక్కువ వయసులోనే కెప్టెన్సీ చేపట్టడమే కాదు జట్టుకు టైటిల్ అందించిన ఆటగాళ్ల వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐదు టైటిల్స్ గెలిచిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అతి చిన్న వయసులో టైటిల్ అందించిన ప్లేయర్ గా కూడా ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో 26 సంవత్సరాల 27 రోజుల వయసులో రోహిత్ శర్మ ముంబైకి కప్ప అందించాడు. ఇక ఆ తర్వాత 2015 సీజన్లో రోహిత్ శర్మ 28 సంవత్సరాల 25 రోజుల వయసులో మరోసారి టైటిల్ అందించాడు. తర్వాత హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 28 సంవత్సరాల 231 రోజుల వయసులో టైటిల్ అందించాడు. ఇక మహేంద్రసింగ్ ధోని 2010లో 28 సంవత్సరాల 292 రోజుల వయసులో చెన్నైకీ టైటిల్ అందించాడు. వార్నర్ 29 సంవత్సరాల 213 రోజుల వయసులో 2016 ఐపీఎల్ లో సన్రైజర్స్ కు టైటిల్ అందించాడు.