అయ్యయ్యో.. క్రికెటర్ ప్యాంటు జారిపోయిందే?
ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారు కదా.. ఏకంగా ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడి ప్యాంటు ఊడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్ క్రికెట్ లీగ్‌కు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న ఈ మ్యాచులను వీక్షించేందుకు ప్రేక్షకులు అందరూ కూడా స్టేడియంకు తరలి వెళ్తున్నారు. ఇక ఈ లీగ్‌లో భాగంగా లంక షేర్, యార్క్ షైర్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన లంక షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్ షైర్ 19 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది.
ఈ క్రమంలోనే ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులలో కూడా ఉత్కంఠ నెలకొంది. తొలి నాకు బంతులకు 7 పరుగులు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. ఇలాంటి ఈ సమయంలో నవ్వులు పూయించే ఒక ఘటన జరిగింది.. లంక షేర్ బౌలర్ ఫుల్ టాస్ బంతి వేయగా క్రీజ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఏడ్జ్ తాకి వికెట్ల వెనకాల గాల్లోకి లేచింది. ఇక మిడ్ అఫ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినా డెన్ విలా క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే డైవ్ చేశాడు. కానీ క్యాచ్ మిస్ అయ్యింది. అనంతరం బంతిని అందుకోవడానికి పైకి లేవగా.. అతని ప్యాంట్ ఒక్కసారిగా జారిపోయింది. వెంటనే తేరుకుని ప్యాంట్ సరిచేసుకున్నాడు. ఈ ఘటన అందరికీ నవ్వు తెప్పించింది.