తక్కువంచనా వేయొద్దు.. నేనేంటో చూపిస్తా : సిరాజ్

praveen
టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఎదుగుతున్న మహమ్మద్ సిరాజ్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఎందుకో అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లు అద్భుతమైన బౌలింగ్ తో  అదరగొడుతూ ఉంటే  అటు అంతర్జాతీయ క్రికెట్ లో కొంత అనుభవం సాధించిన మహమ్మద్ సిరాజ్ మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మంచి ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొన్నాడు. వికెట్లు తీయలేక పోవడమే  కాదు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఎన్నో చెత్త రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల మహమ్మద్ సిరాజ్ పేలవ ప్రదర్శన పై ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో కొత్తదనం ఎక్కడా కనిపించడం లేదు అంటూ మాజీ ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలోనే తన పేలవా ఫామ్ పై మహమ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో జరిగే బోయే టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో నేను బాగా ఆడలేదు.


 కానీ ఇంగ్లాండ్తో జరగబోయే చివరి టెస్ట్ కోసం డ్యూక్స్ బంతులతో సాధన చేస్తున్నాను. మంచి ప్రదర్శన ఇవ్వగలను అనే నమ్మకం కూడా ఉంది. ఇప్పటికే ఆధిక్యం లో ఉన్నామూ కాబట్టి మాలో ఆత్మవిశ్వాసం కూడా కాస్త ఎక్కువగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మెరుగైన ప్రదర్శన చేసి తనపై విమర్శలు చేసిన వారి నోళ్లు మూయిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు సిరాజ్. ఇకపోతే ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 15 మ్యాచ్లు ఆడిన మహమ్మద్ సిరాజ్ 10.07 ఎకానమీ తో  కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు. బెంగళూరు జట్టు ఈ సీజన్ లో ప్లే ఆఫ్ లో అడుగు పెట్టినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: