కొత్త కెప్టెన్.. కొత్త కోచ్.. అదృష్టం కలిసి వస్తుందా?
ఒకప్పుడు ప్రత్యర్థులను తమ ప్రదర్శనలతో వణికించిన జట్టు ఇక ఇప్పుడు మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో అయితే ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక పోతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో క్రికెట్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అటు ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్ తో పాటు కెప్టెన్ కూడా మారిపోయాడు. కొత్త కెప్టెన్గా బెన్ స్టోక్ సారథ్య బాధ్యతలను తన చేతిలోకి తీసుకోగా.. హెడ్ కోచ్గా మెకల్లమ్ జట్టును వెనకుండి నడిపించపోతున్నాడు.
ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా వెటరన్ సీమర్ లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లను మళ్ళీ ఇంగ్లాండ్ జట్టులోకి తీసుకోవడం గమనార్హం హెడ్ కోచ్ మెకల్లమ్ కోరిక మేరకు ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. ఇక మరోవైపు విలియంసన్ జట్టు కూడా తొలి రోజు నుంచే పట్టుసాధించేందుకు సిద్ధమైంది. దీంతో ఇప్పుడు కొత్త కోచ్ కొత్త కెప్టెన్ తో అయిన ఇంగ్లాండ్ కు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి..